స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -674 లోకి అడుగు పెట్టింది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో వసుధార దగ్గరికి పెద్దమ్మ ఎందుకు వెళ్ళింది అంటూ రిషి కోపంగా వస్తాడు. నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను రిషిని వదిలి వెళ్ళని దేవయాని అంది. మీకన్నా నేను మొండి దాన్ని మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. వెళ్లిపోండి మేడం అని వసుధార అంటుంది. "వెళ్ళిపో.. వెళ్ళిపో అంటున్నావ్. ఇదేం నీ ఇల్లు కాదు. గౌతమ్ ది అంటే రిషిది అన్నట్లేగా" అని దేవయాని అనేసరికి.. చక్రపాణి ఇంట్లో నుండి బయటకు వచ్చి.. "ఇది రిషి సర్ ఇచ్చిందే కదమ్మా" అని అంటాడు. ఇస్తే మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటారా? వసుధార నీకు భయమే లేదు అనుకున్నాను.. సిగ్గు కూడా లేదా? అని దేవయాని అంటుంది. ఈ ఇల్లు నాకు అఫీషియల్ గా ఇచ్చింది. మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అని వసుధార అంటుంది.
ఇద్దరి మధ్య గొడవ ముదురుతుండగా అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. "ఏంటీ పెద్దమ్మా.. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఏం జరుగుతుంది. మన పర్సనల్ వాటికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దయచేసి వెళ్దాం పెద్దమ్మ " అని రిషి అంటాడు. అసలు రిషికి ఎలా తెలుసు.. నేను ఇక్కడికి వచ్చానని వసుధార చెప్పిందా.. పిలవగానే రిషి వచ్చేసాడా అని దేవయాని మనసులో అనుకుంటుంది.
మా పెద్దమ్మ మిమ్మల్ని ఏమైనా బాధపెడితే క్షమించండి అంటూ చేతులు జోడించి చెప్తాడు రిషి. అలా వసుధారకి సపోర్ట్ చేసినట్లు రిషి మాట్లాడడంతో వసుధార హ్యాపీ గా ఫీల్ అవుతుంది.
రిషి, దేవయాని కలిసి వాళ్ళింటికెళ్తారు. అక్కడే ఉన్న జగతి, మహేంద్రలతో "రిషిని తీసుకొచ్చాను" అని దేవయాని చెప్తుంది. రిషిని ఇంటికి తీసుకొచ్చినందుకు థాంక్స్ అని జగతి చెప్తుంది. మళ్ళీ మా ముగ్గురిని విడదీయకండి వదిన అని మహేంద్ర చెప్తాడు. వసుధార గురించి ఆలోచిస్తూ "నేను వేరొకరి భార్య గురించి ఆలోచించడం మర్యాద కాదు" అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.